Trump: జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్..! 1 y ago
జన్మతః పౌరసత్వం రద్దుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు. తన ఆదేశాలను ఫెడరల్ కోర్టులు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ సారా హారిస్ ఈ పిటిషన్ సాధారణమైనదని అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్ లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..?కాదా..? అనే విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు.